మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని, బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నేడు (శనివారం) జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సభను నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. మీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని ఆగ్రమం వ్యక్తం చేశారు. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని మండిపడ్డారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయని విమర్శించారు.…