‘చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. ఉండటానికి భూమి, కనీస ఆహారాన్ని పొందడానికి రేషన్ కార్డు, ఓటర్ల లిస్టులో పేరులేని గిరిజనులను తప్పుడు కేసుల్లో పోలీసులు ఇరికించినప్పుడు వారి తరఫున పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఇందులో నటించారు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్…