కామారెడ్డి జిల్లా మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ముగిసింది. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై రైతులు నగల నుంచి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. మేం తీర్మానం చేసినది కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.
జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు.