జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు…