ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ నుంచి రూ.25 లక్షలు మోసం చేసిన ఘటన సంచలనం రేపింది. జగదీష్ చంద్ర బరేలీకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఏదో ఒక కమిషన్‌లో పెద్ద పదవి ఇప్పిస్తానని దుండగులు మోసం చేశారు. జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.