జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్‌ఖర్ పేర్కొన్నారు.
Jagdeep Dhankhar: రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘ సెక్యులర్’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తొలగించాలనే వాదన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే లేవనెత్తిన ఈ అంశాన్ని పలువురు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా ఈ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు.
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు.
Jagdeep Dhankhar: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో..న్కాయ వ్యవస్థపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌తో పాటు నిషికాంత్ దూబే వంటి పలువురు బీజేపీ నేతలు సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి జగదీప్ ధంఖర్ న్యాయవ్యవస్థ అతిగా స్పందించడాన్ని విమర్శించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
BJP MP: సుప్రీంకోర్టు తీరుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీదానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీని మూసేయాలని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దూసే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా బలమైన పదజాలాన్ని ఉపయోగించారు. దేశంలో మతపరమైన హింసను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టుదే బాధ్యత అని, దాని పరిధిని మించి వ్యవహరిస్తోందని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని అనుసరించడం ద్వారా ఏర్పడిన చట్టాన్ని…
గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా విమర్శించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం యొక్క రాజ్యాంగ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
PM Modi: ఛాతి నొప్పితో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించారు. ధంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ జీ ఆరోగ్యం గురించి ఆరా తీశాను.
Jagdeep Dhankar: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ నేడు (ఆదివారం) కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ (IIIT) డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉప రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్,…
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.