BT Naidu: నీ సలహాల వల్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని…