ఏపీ సీఎంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు…
టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం…
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతుంది. కోర్టులో కేసులో ఉన్న పత్రాలు దొంగిలించడం అరాచక పాలనకు పరాకాష్ఠ. పోలీసు కట్టుకధలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్. ఎక్కడో బీహార్లో విన్న కధలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దళిత బిడ్డలను చంపినా, కొట్టినా పట్టించుకోలేదు. నిన్న ఎస్పీ అంత అర్జంటుగా మీడియా సమావేశం పెట్టడం ఎందుకు..?వాళ్లు చెప్పిన అంశాలు నమ్మే విధంగా ఉన్నాయా..?ఎవరిచ్చారో…