ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘జగమే తంత్రం’ మూవీ మొత్తానికీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిజానికి వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లోగా వైనాట్ స్టూడియోస్ కు థియేటర్ల యాజమాన్యంకు మధ్య ఏర్పడిన చిన్నపాటి అగాథంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ సైతం బలపడటంతో…