మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎవర్‌గ్రీన్ క్లాసిక్. 35 ఏళ్ల సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు స్మృతులను పంచుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చింది. రీ-రిలీజ్‌తో మళ్లీ ఇంద్రలోకానికి వెళ్లినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నా మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందరూ నా కెరీర్ అయిపోయిందనుకున్నారు.…