మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎవర్‌గ్రీన్ క్లాసిక్. 35 ఏళ్ల సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు స్మృతులను పంచుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చింది. రీ-రిలీజ్‌తో మళ్లీ ఇంద్రలోకానికి వెళ్లినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు ముందు నా మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అందరూ నా కెరీర్ అయిపోయిందనుకున్నారు. అలాంటి సమయంలో అశ్వనీదత్ కథ చెప్పారు. ఫ్లాపుల్లో ఉన్నా చిరంజీవి, దత్ నన్ను నమ్మి అవకాశమిచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
Read More: Rama Charan: ‘జగదేక వీరుడు’కి నాగ్ అశ్విన్ సీక్వెల్ చేయాలి.. రామ్ చరణ్ డిమాండ్
ఇళయరాజా సంగీతం సినిమాకు కొత్త ఊపు తెచ్చారు. ఆయన జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి. నేను ఎన్టీఆర్‌తో 12, చిరంజీవితో 14 సినిమాలు చేశాను. ‘అందాలలో అహో మహాదయం’ పాట నా కళ్లలో ఎప్పుడూ మెదులుతుంది. ఇళయరాజా మ్యూజిక్‌తో దాన్ని అద్భుతం చేశారు. సినిమాను కాశ్మీర్‌లో తీయాలనుకున్నాం, కానీ విన్సెంట్ వాహినీ స్టూడియో 8వ ఫ్లోర్‌లోనే అంతా తీయొచ్చన్నారు. చలం సెట్స్‌కు విన్సెంట్ కెమెరా మెరుపులు జోడించారు. ఒక్క గ్రాఫిక్ షాట్ లేకుండా అద్భుతం సృష్టించారు. ఇలాంటి సినిమా, హిట్ మళ్లీ రాదు. తుఫాన్, థియేటర్లలో నీళ్లు నిండినా ప్రేక్షకులు చూసి బ్లాక్‌బస్టర్ చేశారు. ఎన్నో సినిమాలు కలెక్షన్స్ సాధించొచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో హిట్ కొట్టడం సామాన్యం కాదు. అప్పటి ప్రేక్షకులు సినిమాను మూడుసార్లు చూడాలనేవారు—ఒకసారి చిరంజీవి కోసం, ఒకసారి శ్రీదేవి కోసం, మూడోసారి వారి నటన కోసం. మే 9న మళ్లీ ఫ్రెష్‌గా థియేటర్‌లో ఈ అనుభవాన్ని ఆస్వాదిస్తా” అని అన్నారు.