Supreme Court: ఇండియన్ ఆర్మీ తీరుపై సోమవారం దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదని, దాన్ని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదని తేల్చిచెప్పింది. లింగ తటస్థతకు నిజమైన అర్ధం.. స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను…