ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.…