దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముగిసినట్టే భావిస్తున్నా.. రాబోయే కాలంలో మరిన్ని వేరియంట్లు ఇబ్బంది పెడతాయంటున్నారు నిపుణులు. మరోవైపు దేశవ్యాప్తంగా గర్భిణులకు కోవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో గర్భిణులకు వ్యాక్సిన్ విషయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. డాక్టర్లు తొలుత వద్దన్నా.. తర్వాత వారికి కూడా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. దేశంలో గర్భిణులకు వ్యాక్సినేషన్ విషయంలో మధ్యప్రదేశ్ ముందు స్థానంలో వుంది. తెలంగాణ చివరిస్థానంలో…