అనంతపురం టీడీపీలో నేతల స్టైలే వేరు. రాజకీయ ప్రత్యర్థులను వదిలేసి.. తమలో తామే పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తారు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు సంబంధం లేకుండా పుట్టపర్తిలో ఎలా పర్యటిస్తారని జేసీని పల్లె ప్రశ్నిస్తుంటే.. కార్యకర్తలలో భరోసా నింపడానికే వెళ్లానని బదులిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఒక ప్రైవేటు స్థలంపై సాగుతున్న వివాదం.. అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. అక్రమాలు నిగ్గు…