Allari Naresh:'అల్లరి' నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కామెడీ హీరోగా ఎదిగాడు. ఇక తండ్రి మరణానంతరం కొన్ని ప్లాపులను చవిచూసిన ఈ హీరో ఇక ట్రెండ్ కు తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకొని రొట్ట సినిమాలకు గుడ్ బై చెప్పి కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. గతేడాది నాంది చిత్రంతో అల్లరి నరేష్ సంచలనం సృష్టించిన విషయం విదితమే.…