NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్‌తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వెళ్లిన మిషన్లు పాఠ్యాంశాలుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT)లో చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న…
అంతరిక్షంలోకి తన చారిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. తన తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన ఆయన.. వీడియో కాల్‌లో తన కుటుంబానికి ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని సందేశం ఇచ్చారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వీడియో కాల్‌లో వర్చువల్‌గా తినిపించారు. చాలా మంది భారతీయులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు…
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లోని మరో ముగ్గురు సభ్యులు అంతరిక్ష ప్రయాణానికి ముందు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ సమాచారాన్ని అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ వెల్లడించింది. సిబ్బంది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడమే క్వారంటైన్ ఉద్దేశ్యం. ఇది అంతరిక్ష కార్యకలాపాల భద్రత, విజయాన్ని నిర్ధారించే ప్రామాణిక ప్రక్రియ. ఆక్సియం-4 మిషన్ ద్వారా వ్యోమగాములు జూన్ 8న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్…