ఇస్రోలో పని చేసే ప్రతి సైంటిస్ట్ కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు.
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.
Pawan Kalyan: ప్రపంచ దేశాల్లో ఇండియా మరో కోట రికార్డ్ ను సృష్టించింది. మన అంతరిక్ష చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. ఎట్టకేలకు చంద్రునిపై చంద్రయాన్ 3 కాలు పెట్టింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దీంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు.