Karnataka:కర్ణాటకలోని ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీ ఇప్పుడు తన పేరుని ‘‘జెరూసలెం’’ ట్రావెల్స్‌గా మార్చుకుంది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్-హమాస్, హిజ్బుల్లా యుద్ధాలు కర్ణాటకలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వర్గం వారు ఇజ్రాయిల్ ట్రావెల్స్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశం అవుతున్న వేల, ఈ ఇజ్రాయిల్ ట్రావెల్ ఉన్న బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు.