Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.