ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’తో చక్కని విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. అదే నెల చివరి వారంలో విడుదలైన ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. విశేషం ఏమంటే… ఇదే పేరుతో 2019లో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది రీమేక్. కాస్తంత గ్యాప్ తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ‘ఇష్క్’తో రీ ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే…