ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు.