Today (06-02-23) Business Headlines: ప్రపంచంలో విలువైన కరెన్సీగా..: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ కొనసాగుతోంది. ఒక కువైట్ దినార్ వ్యాల్యూ లేటెస్టుగా 266 రూపాయల 64 పైసలకు చేరింది. ఈ జాబితాలో కువైట్ దినార్ తర్వాతి స్థానాల్లో బహ్రెయిన్ దినార్, ఒమిని రియాల్ నిలిచాయి. ఒక బహ్రెయిన్ దినార్ విలువ 215 రూపాయల 90 పైసలు పలికింది. ఒక ఒమిని రియాల్ వ్యాల్యూ 211 రూపాయల 39 పైసలుగా నమోదైంది.
Record Level Sales in Festive Season: మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల విలువ రికార్డ్ స్థాయిలో 61 వేల కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 5జీ ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61 శాతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్‌ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12 శాతం…