Earthquake Hits Iran: ఇరాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 528 మంది గాయపడ్డారు. 135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. భూకంపం ధాటికి 12 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు.