Hijab Protest In Iran:ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్స అమిని అనే మహిళ హిజాబ్ వేసుకోనందుకు మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మరణించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన ఆందోళనలు చేస్తున్నారు.