సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలవి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం.. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘ పోరాటమే చేశారు ఏబీవీ.. తన…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు.. యూనిఫాంలో సెక్రటేరియట్‌కు వచ్చారు ఏబీవీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు.. ఇక, ఏబీ వెంకటేశ్వపరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా… సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏబీవీ.. ఈ సందర్భంగా ఓ లేఖను సీఎస్‌కు సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు ఏబీ…