ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ మార్చి 26న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు సందడి చేయనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. 10 జట్లు కలిపి 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వీటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డీవై…