IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్‌కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.…