ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.