ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా వన్డే వరల్డ్ కప్ను ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ముగియగానే ఐపీఎల్ కోసం ఎదురుచూస్తారు. అయితే దానికోసం ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా.. ఈనెల 26లోగా ఫ్రాంచైజీలు తాము విడుదల చేసిన, తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించవల్సి ఉంటుంది.