ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
Apple WWDC 2022 ఈవెంట్ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో.. ఆ సంస్థ ఎలాంటి ఎలాంటి అప్డేట్స్‌తో ముందుకు రానుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మొత్తానికి అంచనాలకి తగినట్టుగానే యాపిల్ సంస్థ ఐఫోన్‌ల కోసం ఐఓఎస్ 16 అప్డేట్‌ను తీసుకురానుంది. నోటిఫికేషన్స్ దగ్గర నుంచి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్‌కు ఈ కొత్త అప్డేట్ ఉపకరిస్తుందని తెలుస్తోంది. గత వర్షన్స్ కంటే ఈ కొత్త వర్షన్ మరింత మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే.. విజువల్లీ ఇది ఐఓఎస్ 15నే పోలి…