ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం.. పలు విషయాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపటి క్రితమే సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.