రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు.
సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తాం: ఖర్గే తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ సీఎం ఎవరనేది నేడు నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం అని తెలిపారు. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన…
సీఎం ఎవరనేదానిపై నేడు క్లారిటీ: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు…