ఇంటర్ విద్యలో యూడైస్.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్ ఎన్‌రోల్‌మెంట్‌ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్.. అయితే, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5 లక్షల 965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.
Inter Syllabus : 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద మార్పులు ఎదురవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలుకు సిద్ధమవుతోంది. అధికారికంగా సిలబస్ ను ఫైనల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ ప్రతిఫలించనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా…
పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మెగా డీఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.