Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini – Kamal Movie Update: సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో డ్రీమ్ కాంబినేషన్లు తెరమీదకు వచ్చాయి. అలాంటి కాంబినేషన్లు వస్తే అభిమానులు మాత్రం కేరింతలు కొడుతుంటారు. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం కలగానే మిగిలిపోయాయి. అలాంటి జాబితాలో ఎప్పుడూ ఉండే కాంబో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ పేర్లు. దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమను శాసించిన ఈ ఇద్దరు దిగ్గజాలు మరోసారి ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే తాత్కాలికంగా ‘KHxRK’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు పెరుగుతుండగా, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2027లో మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం నెల్సన్ ప్రస్తుతం పూర్తిగా ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉండటమే. 2023లో సంచలన విజయాన్ని అందుకున్న ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను 2026 చివరి కల్లా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే దసరా, దీపావళి పండుగలను విడుదల తేదీగా పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
‘జైలర్ 2’ పూర్తయ్యే వరకు నెల్సన్ తన పూర్తి దృష్టిని ఆ ప్రాజెక్ట్‌పైనే కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్, కమల్ హాసన్‌ల కలయికలో తెరకెక్కనున్న చిత్రం వచ్చే ఏడాది చివర్లో మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక రజనీకాంత్ కెరీర్ పరంగా చూస్తే ఆయన రాబోయే కొన్ని సంవత్సరాలకు సంబంధించిన ప్రాజెక్టులను ఇప్పటికే ఖరారు చేసుకున్నట్లు సమాచారం. యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కొత్త తరహా కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ఒక కొత్త ప్రాజెక్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2026 జూన్‌లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని చెబుతున్నప్పటికీ, దీనిపై కూడా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు కమల్ హాసన్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బారివ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘KH237’ ఆయన తదుపరి చిత్రంగా సిద్ధమవుతోంది. ప్రయోగాత్మక కథలు, కొత్త తరహా సినిమాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే కమల్, ఈ చిత్రంతో మరోసారి కొత్తదనాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ప్రస్తుతం అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న అంశం మాత్రం ‘KHxRK’ గురించే. ఒకవైపు రజనీకాంత్ మాస్ ఇమేజ్, మరోవైపు కమల్ హాసన్ నటనా వైవిధ్యం, వీటికి నెల్సన్ దిలీప్‌కుమార్ స్టైల్ కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటికే పెరిగిపోయింది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, దక్షిణాది సినీ పరిశ్రమలో ఇది రాబోయే సంవత్సరాల్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభిమానులందరి చూపు ఒక్కటే. ఈ కలల కలయిక నిజంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? తెరపై ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి కనిపించే రోజు ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..