TS Inter Admissions: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్‌మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్‌సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని..…