ఇంటర్ విద్యార్ధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 2 లక్షల 36 వేల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని, లక్ష పైబడి విద్యార్దులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే అందులో వున్నారన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆత్మహత్య లు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు వద్దని చెప్పే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.…