తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా? తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.…