కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. అప్పటి నుంచి ఖలిస్థానీలకు కంచుకోటగా మారిన కెనడా తదుపరి ప్రధానిపై చర్చలు జోరందుకున్నాయి. చాలా మంది అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీటిలో ఇద్దరు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. కెనడా యొక్క ఈ అత్యున్నత పదవికి చంద్ర ఆర్య, అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ…