దేశ వ్యాప్తంగా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న సూర్యుని ధాటికి బయటకు రావాలంటే జంకుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. ఈరోజు నోయిడాలో వాషింగ్ మిషన్ పేలి మంటలు చెలరేగాయి.
నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.