Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్…