ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ వర్సెస్ పోలీసుగా మారిపోయిందట పరిస్థితి.. జిల్లా ఎస్పీలకు కొన్ని విషయాల్లో నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట.. అయితే, ఈ వ్యవహారం పోలీస్ బాస్‌కు రుచించడంలేదు.. జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి… ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంటూ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్…