ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి,…
కరోనాతో మృతిచెందిన వారి పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఇదివరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ. 10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు. నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది.…
అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లలో చనిపోతారని భావిస్తున్న కొందరి చేత బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్ము కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేదో సినిమా కధలా అనిపిస్తుంది కదూ.. కానీ అలా అనిపించినా అదే నిజం. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురు మనుషులను మట్టుబెట్టిన విషయం కూడా తెలిసి పోలీసులు షాకయ్యారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నల్గొండ జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యంతో…