శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది.
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు