Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.…