ముంబైలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఐఎన్ఎస్ రణ్‌వీర్ అంతర్జాతీయ సరిహద్దు జలాల్లో విధులు నిర్వర్తిస్తోంది. యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించడం వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన నౌకాదళ సిబ్బంది పరిస్థితిని…