Team india bowler Natarajan: టీమిండియా కీలక బౌలర్ నటరాజన్ ఇటీవల జట్టులో కనిపించడం లేదు. దీంతో నటరాజన్‌కు ఏమైందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. టీమిండియా బిజీ బిజీగా పలు దేశాల్లో పర్యటిస్తున్నా నటరాజన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నటరాజన్ ఫిట్‌గా లేకపోవడమే అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణమని తెలుస్తోంది. 2020 ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్న నటరాజన్ అరంగేట్ర సిరీస్‌లోనే అదరగొట్టాడు. నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు…
ఐపీఎల్ తర్వాత టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రోజురోజుకు గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలతో పాటు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా గాయాల కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ కూడా ఈ జాబితాలో చేరాడు. CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత…
ఐపీఎల్‌లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయపడటంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గతంలో సుందర్‌కు గాయమైన కుడి చేతికే మరోసారి గాయమైందని తెలిపాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని విడిచివెళ్లాడు. కాగా టోర్నీ ప్రారంభంలో…
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన స్కోర్ దిశగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ కారణంగా స్టేడియంలోని ఓ అభిమాని గాయపడ్డాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ మీదుగా…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అయితే… కొండ నుండి దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు…
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా ఫ్రాక్చర్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేయగా న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ నుంచి అతడిని…
కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడిన ఐపీఎల్ 2021 త్వరలోనే యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఇదే ఊపును సెకండ్ హాఫ్ లో కూడా ప్రదర్శించి ఐపీఎల్ టైటిల్ అందుకోవాలని అనుకుంటున్న ఆర్సీబీ జట్టుకు షాక్ తగిలింది. మిగిలిన ఐపీఎల్ 2021 సీజన్ కు…
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది. ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అభిషేక్…