ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చించారు.