నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది.కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్, ఇసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈ బృందం చర్చించనుంది..ముందుగా విదేశీ నిపుణులు, ఇంజినీర్లు ప్రాజె క్టును ఆమూలాగ్రం పరిశీలించనున్నారు.
మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ - శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం - కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs - చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ - పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ - హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు - ఫోర్త్ సిటీ రానున్నాయి.
మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.
Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021…