ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా జరగనుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.…